11 మెట్టు: క్రిస్మస్ కథ – దేవుడు తన ప్రియ కుమారుని పంపెను

బైబిలులో  ప్రభువైన యేసు జననవిధానము ఎంతో చక్కగా చెప్పబడింది. ప్రభువైన యేసు జననమునకు అనేక వందల సంవత్సరములకు మునుపే దేవుడు ఒక ప్రవక్త ద్వారా ప్రజలకు ఈ విధముగా ప్రకటింపచేసారు. “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.”- యెషయా 7:14 దేవుడు మన పాపముల నుండి మనలను విడిపించి, దేవుని యొద్దకు తిరిగి తీసికొని వచ్చే ఒక రక్షకుని, లేక విమోచకుని Read More …

10 మెట్టు: మన యెడల దేవునికి ఉన్న ఆశ్చర్యకరమైన ప్రేమ

ఆదాము, హవ్వ పాపము చేసి దేవునితో వారికిగల సన్నిహితసంబంధం పోగొట్టుకున్నారు. వారు దేవుని యొద్దనుండి దూరముగా వెళ్ళవలసి వచ్చింది. అయితే దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మన పాపములను ద్వేషించినప్పటికీ, మనలను ప్రేమించుట ఎప్పటికి ఆపరు. మన పాపములను తొలగించుకొనుటకు మనము ఏమియు చేయలేమని ఆయనకు తెలుసు. ఆయనతో ఎడబాటు కలిగి ఉండుట అనునది మనకు శాశ్వతముగా లభించిన శిక్ష. మనలను రక్షించి, మనలను ఆయనకు దగ్గరగా తీసికొని వచ్చుటకు ఆయన తన కుమారుడైన ప్రభువైన యేసును Read More …

9 మెట్టు: ఆదాము, హవ్వ మరియు వారి పాపము

దేవుడు సృష్టించిన వారిలో మొట్టమొదటి మనుష్యులు ఆదాము మరియు హవ్వ. బైబిలులోని ప్రధమ గ్రంధమైన ఆదికాండములో వీరి గురించి చెప్పబడింది. దేవుడు వారిని తన స్వరూపములో నిర్మించెను. ఎదేను అను సౌందర్యవంతమైన వనమును దేవుడు వారికి జీవించుటకు ఇచ్చెను. దేవుడు ప్రతి రోజు, వారితో కలసి నడచుటకును, మాట్లాడుటకును వచ్చేవారు. అది మీరు ఊహించగలరా? సర్వశక్తిగలదేవుడు, భూమ్యాకాశముల సృష్టికర్త, తాను సృజించిన మనుష్యులతో సమయము గడుపుటకు ఇష్టపడేవారు. ఎందుకంటే వారు ఆయనకు ప్రత్యేకమైన వారు గనుక! అటు Read More …

8 మెట్టు: దేవుడు మన సృష్టికర్త

‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ….’ – యోహాను 3:16 లో బైబిలు మనకు చెబుతుంది. బైబిలులో దేవుడు తన గురించియు, తనకు మనపట్ల గల ప్రేమను గురించియు ఏమి చెప్పుచున్నారు? ఆదికాండము 1:1 – బైబిలులోని మొదటివచనము లో  ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’ అని చెప్పబడింది. ఆయన సూర్యున్ని, చంద్రున్ని, నక్షత్రములను, సమస్త ప్రపంచములను సృష్టించెను. ఆయన పర్వతములను, నదులను, సెలయేరులను, జలపాతములను సృష్టించెను. ఆయన చెట్లను, పూవులను, మొక్కలను, సమస్త జంతువులను, పక్షులను Read More …

7 మెట్టు: బైబిలు గ్రంధం ద్వారా దేవుడు మనతో మాట్లాడుట

మీ ప్రార్ధన దేవుడు ఆలకిస్తున్నారన్న సంతోషం మీకు కలిగిందా? దేవుడు మీతో మాట్లాడవలెనని, మీ ప్రార్ధనలకు జవాబునివ్వవలెనని మీరు వేచియుంటే,  దేవుడు బైబిలు లోని వాక్యము ద్వారా మీతో  మాట్లాడుతారు. అందుకే బైబిలును  ‘దేవుని వాక్యము’ అని అంటారు. బైబిలు అనగా  క్రైస్తవ లేఖనము, పరిశుద్ధ గ్రంధము. దేవుడే దాని రచయిత. అనేక మంది మనుష్యులను దానిని వ్రాయుటకు వాడుకొన్నారు. వారు దేవుడు చెప్పిన ప్రకారము దానిని వ్రాసారు. బైబిలులో రెండు విభాగములు కలవు: మొదటి విభాగమును Read More …

6 మెట్టు: ప్రార్ధించాలి! ఏమని ప్రార్థించాలి?

ప్రభువైన యేసు ఎలా ప్రార్దించాలో తన శిష్యులకు నేర్పారు. ఆయనను మీరు అడిగిన యెడల మీకు కూడా ఎలా ప్రార్దించాలో నేర్పిస్తారు. నేను ఆరాధనా ప్రార్ధనను ఈలాగున ప్రార్ధిస్తాను: “యేసు ప్రభువా! నేను మిమ్ములను ఆరాధించుచున్నాను. మీ ముందు తలవంచి ప్రార్ధిస్తున్నాను. మీరు దేవుడై, సర్వశక్తిమంతుడై యున్నారు. మీరు నా రక్షకుడై యున్నారు. మిమ్ములను స్తుతించుచున్నాను. మీకు నాపైగల అపారమైన ప్రేమకు వందనములు తెల్పుచున్నాను.” నేను ప్రార్ధించి, ఆయనను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి మరింత ఎక్కువగా Read More …

5 మెట్టు: దేవునితో మాట్లాడుట

మీరు ప్రభువైన యేసు క్రీస్తును అనుసరించుటకు నిశ్చయించుకొన్నారు. నేను ఏ విధంగా ప్రార్ధించాలి అని ఆలోచిస్తున్నారా? ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడుట. ప్రతి పాఠముచివర, ప్రభువైన యేసుకు ఒక ప్రార్ధన అమర్చబడి ఉంది. మీరు ఆ ప్రార్ధనను మనసులో కానీ, బహిరంగముగా గాని చెప్పియుంటే మీరు ఇదివరకే  ప్రార్ధన చేయటము ప్రారంబించారు. యేసు ప్రభువును నేను వివిధ పద్ధతులలో ప్రార్ధించుదును. నేను ఆయనను స్తుతించాలి అని అనుకొన్నప్పుడు, ఒక నెమ్మదియైన స్థలమును ఎన్నుకొని, మోకాల్లూని, చేతులు జోడించి, Read More …

4 మెట్టు: అంధకారము నుండి వెలుగు లోనికి

నేను ఈ జీవిత వలయములో తప్పిపోయి అంధకారములో తడబడుతూ నిరీక్షణ లేకుండా ఉండియుంటిని. నేను ఒక రోజున ఆదరణకరమైన ప్రేమగల స్వరము నన్ను పిలచుట విన్నాను. అది ప్రభువైన యేసుని స్వరము! ‘నేను ఈ లోకమునకు వెలుగునై యున్నాను. నన్ను వెంబడించుము. నీవు ఇక అంధకారములో ఎప్పటికీ ఉండవు. మరియు నేను నీ జీవితమునకంతటికి మార్గదర్శిగా ఉంటాను’ అని యేసు ప్రభువు చెప్పెను. ఆయన ఆహ్వానాన్ని నేను సంతోషంగా స్వీకరించాను. ఆయన వెలుగులో అడుగు పెట్టాను. నాకింక Read More …

3 మెట్టు: యేసు ప్రభువు లేని చీకటి జీవితం

ప్రభువైన యేసు వద్దకు వచ్చి ఆయనను నా ప్రభువుగా ఉండమని అడుగక మునుపు నా జీవితములో నా చిత్తానుసారముగా నేను నడచుచుంటిని. నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు. నేను నా ప్రణాళికలను సిద్ధము చేసికొంటిని గాని అవి సఫలమగునో లేదో నాకు తెలియదు. చీకటి అరణ్యములో తడబడుతూ, మార్గమును వెదకుచూ ఉండేవారి వలె ఉంటిని. నేను ఎటు వెల్లుచున్నానో తెలియకయుంటిని. నేను సిద్ధము చేసికొన్న నా జీవిత ప్రణాలికలు తప్పు దారిలో ఉన్నాయని తెలిసికొంటిని.   నా Read More …

2 మెట్టు: క్షమాపణ, యేసు ప్రభువునందు నూతన జీవితం

దేవుడు తానే నా పాపప్రాయశ్చిత్తము చేయుటకు ఈ లోకానికి దిగి వచ్చెనన్న విషయము నేను ఊహించలేను. నా పాపపు జీవితమును జ్ఞాపకము చేసికొంటున్నాను – నా  హృదయములో ఉండిన చెడు తలంపులు, దేవుని న్యాయవిధులకు వ్యతిరేకముగా నేను మాట్లాడిన తప్పుడు మాటలు, చేసిన చెడు పనులను జ్ఞాపకము చేసికొంటున్నాను. ఇవన్నియు నా వీపుపై అధిక భారముగా ఉండినవి, నా హృదయముపై ఒక చీకటి మచ్చను మిగిల్చినవి. నా హృదయము బ్రద్దలగుచున్నది. యేసు ప్రభువు సిలువ మీద మరణించవలసి Read More …