ఈ లోకంలో ఉన్న దుష్ఠత్వం గురించి ఏమైన తెలుసా? అది యెక్కడ నుంచి వచ్చిందో మరియు దానివెనుక ఎవరున్నరో?
నీవు దేనిగూర్చి సంతోష పడుతున్నావో లేదా సుఖపడుతున్నావో, అది తప్పైనా సరే ముందుకెళ్ళు, పర్వాలేదు అని లో లోపల నీ అంతరాత్మ చెప్పడం ఎప్పుడైనా విన్నావా?
దేవునికి, మనకి శత్రువు – పరిశుద్ధగ్రంధం ప్రకారం చూస్తే ఆదుష్టత్వం మరెవరోకాదు సాతాను. అతని (సాతాను) ముఖ్యవుద్దేశ్యమేమిటంటే, అందరు దేవుని ఆజ్ఞలనుండి వైదొలగి, పాపం చేయడమే. బైబిల్లోని ఆదికాండంలో సాతాను గురించి విన్నాము. దేవుడు ఆదాము, హవ్వలు సంతోషంగా నివసించడానికి “ఏదేను” అనే అందమైన తోటనిచ్చాడు, కాని ఆతోటమధ్యలోనున్న ఒక ప్రత్యేకమైన చెట్టు కాయలు మాత్రం తినవద్దన్నాడు. అవితింటే మీరు మరణిస్తారని హేచ్చరించాడు.
మొదటి అవకాశంగా సాతాను వారిని ఆకర్షించడానికి ” దేవుడు ఆఫలాలు నిజంగా తినవద్దని అన్నాడా? ఏమి కాదు మీరు చావనే చావరు, తినండి” అని అన్నాడు బైబిల్లో సాతానుకు “అభద్ధికుడు” అని పేరు.
మనకు తెలుసుగదా చెడు ఎంత ఆకర్షణీయంగా వుంటుందో ఆదాము, హవ్వలకు కూడా ఒక అవకాశం వచ్చింది అదేంటంటే దేవుని ఆజ్ఞ, లేక హెచ్చరిక శిరసావహించడమా? సాతాను మాట శిరసావహించడమా? తమ ఇష్టాయిష్టాలని దేవుడు వారికే వదిలేశాడు.
వారు దేవుని ఆజ్ఞమీరారు. ఎంత విచారకరం. దేవునికి బదులు సాతానుకి విధేయులయ్యారు వారు దేవునికి అవిధేయులైన పాపానికి దేవునినుండి విడగొట్టబడ్డారని వెంటనే తెలుసుకున్నారు.
వారు సమస్తం పోగొట్టుకున్నారు. మొదటిగా ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని, స్నేహాన్ని, పోగొట్టుకున్నారు. ఆ ఏదేను తోటలో వారికున్న దేవుని యొక్క కాపుదల, భద్రత కూడా పోగొట్టుకున్నారు.
చివరికి సాతానే జయించాడు. అతని బానిసలుగా అంటే దుస్టత్వానికి బానిసలుగా చేసుకొని వారి ఆత్మలను బంధించివేసాడు. ఎలాగంటే వారు వారి వారసులు పాపంలోనె పుట్టి, సాతాను కట్టుబడి, అందులోనె ఆశ లేకుండా మరణిస్తారు!
సాతాను ప్రణాళిక పూర్తిగా పనిచేసినట్లయితే ఎంత భయంకరమైనది! మనమందరం పాపులమై నరకం వరకు వానిని అనుసరించేవారము. దేవుడు నరకాన్ని సాతాను మరియు అతని సహాయకులు కోసం సిద్ధం చేసాడు, వీరు ‘రాక్షసులు’ లేదా ‘దుష్ట ఆత్మలు’.
కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు తెలుసు! సాతాను బారిలో ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రము! మన విమోచకుడు సాతాను బానిసత్వ నుండి మనల్ని విడిపించాడు.
ప్రార్ఢన: ప్రభువైన దేవా! ధుష్తుని పట్లకాకుండ మీ పట్లమేము విధేయులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్!