17 మెట్టు: దేవుడు, పరిశుధాత్మ

“యేమిటి ఈ పరిశుధాత్మ?” అని ఆశ్చర్యపడ్తున్నావా?

యేసు ప్రభు చనిపొయేముందు, శిష్యులతో తను తన తండ్రి దేవుని యొద్దకు వెలుచున్నానని వారితో చెప్పెను. శిష్యులు ఇది విని చాలా దుఖించారు. వారి మనసులు బాధతో క్రుంగిపొయాయి.

అప్పుడు ఆయన: ” దుఖించకుడి…మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై, నా తండ్రి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును…ఈ ఆదరణకర్త మీతో కూడా నివసించును, మీలో ఉండును మీకు అని విషయాలు నేర్పును” అని అనెను.

యేసు ప్రభు చనిపొయి, సజీవుడై వచ్చాక శిష్యులతో నలభై రోజులు గడిపెను. ఆ సమయంలో వారికి బోధిస్తూ వారికి సూచనలు ఇచ్చారు. “పరిశుధాత్మ మియొద్దకు వచ్చును. అది మీకు నా గురించి లొకానికి ప్రకటించేందుకు శక్తిని ప్రసాదించును” అని చెప్పెను. వారితో ఇది చెప్పగా, ఆయన పరలోకమునకు వెళ్లేను.

పెంతెకోస్తను పండుగ దినమున శిష్యులందరు ఒక చొట ప్రార్థన చేసేందుకు కలిసి కొనారు. యేసు చెప్పినట్టె ఆరోజు వారందరూ పరిశుధాత్మను పొందుకున్నారు. ప్రభువైన యేసుని చంపిన ప్రజలను గూర్చి శిష్యులు భయపడుతూ ఉన్నారు మరియు వారు దాక్కున్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అది వారికి ఎంతో ధైర్యాన్ని అనుగ్రహించింది. వారు అందరితో యేసు ప్రభు గురించి, ఆయన ప్రసాదించే నిత్య జీవము గురించి బోధించారు.

పరిశుధాత్మ దేవుని ఆత్మ. మనం ఎన్నడైతే యేసు ప్రభుని మన రక్షకుడిగా అంగీకరిస్తామో, అపుడు పరిశుధాత్మ మన హృదయాలలో నివసించడానికి వస్తుంది!

ఇందులో ఆద్భుతమైన సత్యం ఏమిటంటె:పరిశుధాత్మ ద్వారా, దేవుడు, మన పరలోకపు తండ్రి, యేసు ఫ్రభు, మన రక్షకుడు కూడా మన హృదయములో నివసించును. మనం ఇంతకన్నా దీవింప బడగలమా?!

తదుపరి పాఠంలో, మన జీవితములో పరిశుధాత్మ యొక్క పని గురించి నెర్చుకుందాం.

ఫ్రార్ధన: తండ్రి, ఎల్లప్పుడు మాతో ఉండేందుకు మరియు మాకు మార్గనిర్దేశం చేసేందుకు మీరు మాకిచ్చిన బహుమతి పరిశుధాత్మ కోసం ధన్యవాదాలు. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *