మన యజమనుడైన యేసు ప్రభువుతో ప్రయాణము కొనసాగించాలని మీరు ఆసక్తి కలిగియున్నారా? నేను చాలా ఆసక్తి కలిగియున్నాను! పదండి వెళ్దాము!
ఆయన చేసిన ఎన్నో అధ్బుతకార్యాలను చూచాము. ఇప్పుడు ఆయన పాదముల చెంత చేరి ఆయన బోధలను విందాము.
ఆయన బోధలను వినుటకు అనేకమంది ప్రజలు వస్తునారు. తండ్రిని గూర్చియు, తనను గూర్చియు ఎన్నో శక్తివంతమైన సత్యములను ఆయన వారికి బోధిస్తున్నారు. సామాన్య మనుష్యులు ఈ సత్యములను గ్రహింపగలుగుటకు వీలుగా ఆయన పలుమార్లు చిన్న కధలవంటి ఉపమానములను వాడుచూ బోధించేవారు.
ఆయన తాను దేవుని కుమారుడననియు, తండ్రియైన దేవునితో సమానమనియు విశదీకరించుచూ “నేనును నా తండ్రియు ఏకమైయున్నాము” అని చెప్పారు.
‘నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు’ అని చెప్పారు. తండ్రియైన దేవుని చేరుటకు తానే మార్గమని స్పష్టముగా తెలియజేసారు.
లోకపు మార్గములలో కాక దేవుని మార్గములలో ఏలాగున నడచుకొనవలెనో ప్రజలకు ఆయను బొధించారు.
“నేను మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఇతరులను క్షమించవలెను”
“మీ శత్రువులను ప్రేమించండి. వారికి ఉపకారము చేయండి. వారి కొరకు ప్రార్ధన చేయండి.”
“దేవుని రాజ్యములో గొప్పవారిగా ఉండాలనుకొంటే, అందరిలో అల్పులుగా ఉండండి.”
“నేను పరిచర్య చేయుటకు వచ్చియున్నాను. మీరు కూడా పరిచారకులుగా ఉండండి.”
“నేను మిమ్ములను ప్రేమించిన విధముగా మీరును ఇతరులను ప్రేమించండి.”
అని యేసు ప్రభువు చెప్పెను.
ఆయన మాటలను విన్నప్పుడు మన హృదయములో ఎంతో ప్రోత్సాహము కలుగుతుంది. ఆయనను విడిచి వెళ్ళుటకు మనము ఇష్టపడము. ఆయన మనతో బైబిలు ద్వారా ఇప్పుడును బోధిస్తునారు. ఆసక్తి కలిగినవారమై విందామా!
ప్రార్ధన: ప్రభువైన యేసు, మీ అనుచరులముగా ఏలాగున జీవించాలో మాకు మీరు బోధించుచున్నందుకు వందనములు. ఆమెన్!