10 మెట్టు: మన యెడల దేవునికి ఉన్న ఆశ్చర్యకరమైన ప్రేమ

ఆదాము, హవ్వ పాపము చేసి దేవునితో వారికిగల సన్నిహితసంబంధం పోగొట్టుకున్నారు. వారు దేవుని యొద్దనుండి దూరముగా వెళ్ళవలసి వచ్చింది. అయితే దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మన పాపములను ద్వేషించినప్పటికీ, మనలను ప్రేమించుట ఎప్పటికి ఆపరు.

మన పాపములను తొలగించుకొనుటకు మనము ఏమియు చేయలేమని ఆయనకు తెలుసు. ఆయనతో ఎడబాటు కలిగి ఉండుట అనునది మనకు శాశ్వతముగా లభించిన శిక్ష. మనలను రక్షించి, మనలను ఆయనకు దగ్గరగా తీసికొని వచ్చుటకు ఆయన తన కుమారుడైన ప్రభువైన యేసును ఈ పాపకరమైన లోకమునకు పంపెను. ప్రభువైన యేసు మనకొరకు సిలువపై మరణించి, మనకు కలుగవలసిన శిక్షను తీసికొనుటకు ఆయన వచ్చెను.

మనలను రక్షించుటకు ఆయన కుమారుని ఇచ్చిన ఇంతటి దేవుని ప్రేమను మీరు ఊహించగలరా?

బైబిలులో యోహాను 1:12 “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అని దేవుడు చెప్పిన మాటలు.

ఈ మాటలు మనము ప్రభువైన యేసును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన నుండి క్షమాపణ  పొందినప్పుడు మనకు వర్తిస్తాయి. దేవుడు మన పాపములను తుడిచివేసారు. మనలను పవిత్రులనుగా చేసి ఆయన మనలను తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించారు.

మనము, తండ్రీ! అని ఆయన వద్దకు వెళ్ళినప్పుడు  ఆయన మనలను ప్రేమతో ఆహ్వానిస్తారు. మనము ఆయన వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడి, ఆయనను ప్రేమించుచున్నామని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తారు.

దేవుని కుటుంబములో చేర్చబడటం, దేవుని పరలోకపు తండ్రిగా కలిగి యుండటం ఎంతో సంతోషకరమైన విషయము. మనము దేవుని కుటుంబములోనికి తిరిగి జన్మించాము!

యోహాను 3:16 లో “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు  విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని దేవుడు చెప్పిన మాటలు.

ప్రార్ధన: ప్రియమైన పరలోకపు తండ్రి! నన్ను రక్షించుటకు మీ కుమారుని నాకొరకై పంపిన మీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మీకు వందనములు. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *