4 మెట్టు: అంధకారము నుండి వెలుగు లోనికి

నేను ఈ జీవిత వలయములో తప్పిపోయి అంధకారములో తడబడుతూ నిరీక్షణ లేకుండా ఉండియుంటిని.

నేను ఒక రోజున ఆదరణకరమైన ప్రేమగల స్వరము నన్ను పిలచుట విన్నాను. అది ప్రభువైన యేసుని స్వరము!

‘నేను ఈ లోకమునకు వెలుగునై యున్నాను. నన్ను వెంబడించుము. నీవు ఇక అంధకారములో ఎప్పటికీ ఉండవు. మరియు నేను నీ జీవితమునకంతటికి మార్గదర్శిగా ఉంటాను’ అని యేసు ప్రభువు చెప్పెను.

ఆయన ఆహ్వానాన్ని నేను సంతోషంగా స్వీకరించాను. ఆయన వెలుగులో అడుగు పెట్టాను. నాకింక భయము లేదు. ఆయన నా చేయి పట్టుకొని నన్ను నడిపించును. నేను కేవలము ఆయనను వెంబడిస్తాను.

ఈ భూమిపై నా జీవితము ఏలాగున ఉండబోతుందో నాకు తెలియదు. అయితే యేసు ప్రభువుకు అది తెలియును. ఆయన కేవలము నాకొరకై ఒక ప్రణాలికను సిధ్ధపరచెను.

“నీపట్ల నాకున్న ఉద్దేశములు నాకు తెలియును. అవి మంచి ఉద్దేశములు” అని ఆయన చెప్పుచున్నారు.

“నిన్ను ఎన్నడును విడువను, ఎడబాయను” అని ఆయన వాగ్ధానము చేయుచున్నారు.

 నేను ఆయనను నమ్ముచున్నాను. ఈ జీవిత కష్టనష్టములలో ఆయన ఆదరణలో నేను క్షేమంగా ఉన్నానని నాకు తెలియును.

నేను కేవలము నా చింతలన్నియు, నా కష్టములన్నియు ఆయన వద్ద వదిలి వేయుదును. ఆయనే నాకు వాటిలో మార్గము చూపించును.

మీరు కూడా ప్రభువైన యేసు యొక్క వెలుగులోకి అడుగు పెట్టారు. ఆయన మీ చేయి పట్టుకొనుచున్నారు. ఈ జీవితములో ఆయన మిమ్ములను నడిపించును. మీరు సురక్షితముగా ఉంటారు.

 ప్రార్ధన: ప్రభువైన యేసు! మీకు వందనములు! మీరే నా జీవితమునకు  వెలుగును, మార్గదర్శియునై యున్నారు. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *