ప్రభువైన యేసు వద్దకు వచ్చి ఆయనను నా ప్రభువుగా ఉండమని అడుగక మునుపు నా జీవితములో నా చిత్తానుసారముగా నేను నడచుచుంటిని.
నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు. నేను నా ప్రణాళికలను సిద్ధము చేసికొంటిని గాని అవి సఫలమగునో లేదో నాకు తెలియదు.
చీకటి అరణ్యములో తడబడుతూ, మార్గమును వెదకుచూ ఉండేవారి వలె ఉంటిని. నేను ఎటు వెల్లుచున్నానో తెలియకయుంటిని.
నేను సిద్ధము చేసికొన్న నా జీవిత ప్రణాలికలు తప్పు దారిలో ఉన్నాయని తెలిసికొంటిని. నా జీవితము కొన్నిసార్లు ఇబ్బందులు లేకుండా సాగినట్లున్నా, ఒక పెద్ద సమస్య రాగానే, వెలుపలికి రాలేనట్టి ఒక అగాధంలో పడినట్లుగా నేను దుఖించుచుంటిని.
నా జీవన మార్గములో కష్టములు రాగానే, నేను బలహీనముగా నీరసించిపోతిని. పలుమార్లు పడిపోయి తిరిగి లేవలేని పరిస్థితిలో ఉంటిని.
నా జీవన పయనము ఎటు కొనసాగుతున్నదో నాకు తెలియకుండెను. సమాధానము లేని ప్రశ్నలు కలిగి ఉంటిని.
అంధకారభరితమైన జీవనారణ్యములో మార్గము తప్పితిని. నా జీవితము అర్థరహితముగా ఉండినది.
“నాకు సహాయము చేయగలవారెవరైనా ఉన్నారా” అని నిరాశ చెందితిని.
మీరు మీ జీవితములో ఈలాగున నిరాశ చెందుతున్నారా? భయపడకండి!
మీకు సహాయము చేయవలెనని యేసు ప్రభువు వేచియున్నారు. ఆయన వద్దకు రండి. బైబిలు లో ఈలాగున ఉంది – “నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.” – యోహాను 1:9
ప్రార్ధన: యేసు ప్రభువా, అంధకారములో నుండి వెలుగులోనికి నన్ను నడిపించుము. ఆమెన్!