దేవుడు తానే నా పాపప్రాయశ్చిత్తము చేయుటకు ఈ లోకానికి దిగి వచ్చెనన్న విషయము నేను ఊహించలేను. నా పాపపు జీవితమును జ్ఞాపకము చేసికొంటున్నాను – నా హృదయములో ఉండిన చెడు తలంపులు, దేవుని న్యాయవిధులకు వ్యతిరేకముగా నేను మాట్లాడిన తప్పుడు మాటలు, చేసిన చెడు పనులను జ్ఞాపకము చేసికొంటున్నాను. ఇవన్నియు నా వీపుపై అధిక భారముగా ఉండినవి, నా హృదయముపై ఒక చీకటి మచ్చను మిగిల్చినవి.
నా హృదయము బ్రద్దలగుచున్నది. యేసు ప్రభువు సిలువ మీద మరణించవలసి వచ్చిన నా పాపములన్నిటి గురించి నేను పశ్చాత్తాపపడుచున్నాను. నేను కన్నీటితో పశాత్తాపపడుచున్నాను. నా పాపములను క్షమించమని యేసు ప్రభువును నేను దీనముగా అడుగుచున్నాను. ఆయన నా విరిగిన హృదయమును చూచి, సంతోషముగా నన్ను క్షమిస్తారు.
బైబిలు లో ” మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. “అని 1 యోహాను 1:9 లో చెప్పబడింది.
నా హృదయములో ఆనందము నిండింది. దేవుడు నన్ను క్షమించారు! నా పాపపు కొండ ఇక పోయింది. నేను శుభ్రముగా కడుగబడ్డాను. నేను ఒక నూతన వ్యక్తిని! ఇకపై పాపము చేయుటకు ఇష్టపడను. యేసు ప్రభువు కొరకై జీవించాలని కోరుచున్నాను. యేసు ప్రభువుకు నా జీవితమును ఎంతో సంతోషముతో ఇచ్చుచున్నాను.
నూతన జీవితము ఇక నాకుంది! నేను నా పాత పాప జీవితమును వదిలివేసితిని. నేను పూజించే ఇతర దేవుళ్ళనుండి, నేను పూజించే భౌతిక వస్తువులనుంచి వైదొలగితిని. ఇవేవీ నన్ను నా పాపముల నుండి రక్షించలేవు. యేసు ప్రభువు మాత్రమే రక్షించగలుగుతారు.
యేసు ప్రభువును మాత్రమే ఆరాధించి, వెంబడించాలని ఇప్పుడు కోరుచున్నాను.
నేను చనిపోయిన తరువాత పరలోకమునకు వెళ్లి నేను ఆయనతో నిత్యము జీవించెదనని ఆయన వాగ్దానము చేయుచున్నారు – ఎందుకంటే నా పాపములన్నియుపోయి నేను ఆయన దృష్టికి పరిశుభ్రముగాను, పవిత్రముగాను కనబడుతున్నాను గనుక.
ప్రార్ధన: ప్రభువైన యేసూ, నన్ను రక్షించినందుకు, నాకు ఈ లోకములో నూతన జీవితమును ఇచ్చినందుకు మరియు పరలోకములో నిత్య జీవమును ఇచ్చినందుకు మీకు వందనములు. ఆమెన్!