ప్రభువైన యేసుతో మొట్టమొదటి అడుగులు

ప్రభువైన యేసుతో మొట్టమొదటి అడుగులు

– Translated by Lakshmi Madasu and Sheela Thomas

నమస్కారం నా ప్రియమైన వారలారా!

ప్రభువైన యేసు క్రీస్తుకు మీ హృదయమును, జీవితమును సమర్పించవలెనని మీరు నిర్ణయించుకొన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఆయనతో ఎంతో ఉత్సాహకరమైన ప్రయాణము ఇక మీదట మీముందుంది. ఇప్పటికి ఎన్నో సంవత్సారాలుగా నేను నా ప్రభువును, రక్షకుడును అయిన యేసు ప్రభువును అనుసరించాను. ఆయన నా నమ్మకమైన దేవుడని, దయగల, శ్రద్ధగల స్నేహితుడని తెలిసికొన్నాను. ఆయన నాకొరకై నిర్దేశించిన జీవితానుభవములలొ ఆయనతోపాటుగా పయనించుచూ, ఆయన పాదముల యొద్ద కూర్చొని వినుచుండగా ఆయన నాకు ఎన్నో పాఠములను నేర్పించారు. ఈ పాఠములు ప్రభువుతో నాకు గల వ్యక్తిగత సహవాసము వలన ఉద్భవించినవి.

మీరు “ప్రభువైన యేసుతో మొట్టమొదటి అడుగులు” వేయుచుండగా , ఈ పాఠముల ద్వారా ఆయన మీ కొరకు దాచియుంచిన ఆనందమును మీరు పొందవలెనని, మీ చేయి పట్టుకొని నేను మిమ్మల్ని నడిపించాలని నా కోరిక.

అయితే పదండి, వెళ్దాము!

యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెషయా 12:4 వసంత (లీల) విల్ఫ్రెడ్

    1 మెట్టు: యేసు ప్రభువు నా రక్షకుడు

    ఒక రోజు నేను యేసు ప్రభువుతో “యేసు ప్రభువా! మీరు నా ప్రభువని, నా రక్షకుడని అంగీకరించుచున్నాను” అని చెప్పాను. ఆయన నా జీవితమునకు ప్రభువుగా ఉండాలని కోరుకొన్నాను.  నా స్వంత దారిలో పయనించటం మానుకొన్నాను.  నేను వెనుదిరిగి యేసు ప్రభువును వెంబడించుట మొదలు పెట్టాను. యేసు ప్రభువును వెంబడించవలెనని నేనెందుకు కోరుచున్నాను? ఎందుకంటే ఆయనను నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. కాబట్టి రక్షకుడంటే నన్ను దేనినుండైనా రక్షించే వ్యక్తి లేదా అపాయము నుండి నన్ను కాపాడే Read More …

    2 మెట్టు: క్షమాపణ, యేసు ప్రభువునందు నూతన జీవితం

    దేవుడు తానే నా పాపప్రాయశ్చిత్తము చేయుటకు ఈ లోకానికి దిగి వచ్చెనన్న విషయము నేను ఊహించలేను. నా పాపపు జీవితమును జ్ఞాపకము చేసికొంటున్నాను – నా  హృదయములో ఉండిన చెడు తలంపులు, దేవుని న్యాయవిధులకు వ్యతిరేకముగా నేను మాట్లాడిన తప్పుడు మాటలు, చేసిన చెడు పనులను జ్ఞాపకము చేసికొంటున్నాను. ఇవన్నియు నా వీపుపై అధిక భారముగా ఉండినవి, నా హృదయముపై ఒక చీకటి మచ్చను మిగిల్చినవి. నా హృదయము బ్రద్దలగుచున్నది. యేసు ప్రభువు సిలువ మీద మరణించవలసి Read More …

    3 మెట్టు: యేసు ప్రభువు లేని చీకటి జీవితం

    ప్రభువైన యేసు వద్దకు వచ్చి ఆయనను నా ప్రభువుగా ఉండమని అడుగక మునుపు నా జీవితములో నా చిత్తానుసారముగా నేను నడచుచుంటిని. నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు. నేను నా ప్రణాళికలను సిద్ధము చేసికొంటిని గాని అవి సఫలమగునో లేదో నాకు తెలియదు. చీకటి అరణ్యములో తడబడుతూ, మార్గమును వెదకుచూ ఉండేవారి వలె ఉంటిని. నేను ఎటు వెల్లుచున్నానో తెలియకయుంటిని. నేను సిద్ధము చేసికొన్న నా జీవిత ప్రణాలికలు తప్పు దారిలో ఉన్నాయని తెలిసికొంటిని.   నా Read More …

    4 మెట్టు: అంధకారము నుండి వెలుగు లోనికి

    నేను ఈ జీవిత వలయములో తప్పిపోయి అంధకారములో తడబడుతూ నిరీక్షణ లేకుండా ఉండియుంటిని. నేను ఒక రోజున ఆదరణకరమైన ప్రేమగల స్వరము నన్ను పిలచుట విన్నాను. అది ప్రభువైన యేసుని స్వరము! ‘నేను ఈ లోకమునకు వెలుగునై యున్నాను. నన్ను వెంబడించుము. నీవు ఇక అంధకారములో ఎప్పటికీ ఉండవు. మరియు నేను నీ జీవితమునకంతటికి మార్గదర్శిగా ఉంటాను’ అని యేసు ప్రభువు చెప్పెను. ఆయన ఆహ్వానాన్ని నేను సంతోషంగా స్వీకరించాను. ఆయన వెలుగులో అడుగు పెట్టాను. నాకింక Read More …

    5 మెట్టు: దేవునితో మాట్లాడుట

    మీరు ప్రభువైన యేసు క్రీస్తును అనుసరించుటకు నిశ్చయించుకొన్నారు. నేను ఏ విధంగా ప్రార్ధించాలి అని ఆలోచిస్తున్నారా? ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడుట. ప్రతి పాఠముచివర, ప్రభువైన యేసుకు ఒక ప్రార్ధన అమర్చబడి ఉంది. మీరు ఆ ప్రార్ధనను మనసులో కానీ, బహిరంగముగా గాని చెప్పియుంటే మీరు ఇదివరకే  ప్రార్ధన చేయటము ప్రారంబించారు. యేసు ప్రభువును నేను వివిధ పద్ధతులలో ప్రార్ధించుదును. నేను ఆయనను స్తుతించాలి అని అనుకొన్నప్పుడు, ఒక నెమ్మదియైన స్థలమును ఎన్నుకొని, మోకాల్లూని, చేతులు జోడించి, Read More …

    6 మెట్టు: ప్రార్ధించాలి! ఏమని ప్రార్థించాలి?

    ప్రభువైన యేసు ఎలా ప్రార్దించాలో తన శిష్యులకు నేర్పారు. ఆయనను మీరు అడిగిన యెడల మీకు కూడా ఎలా ప్రార్దించాలో నేర్పిస్తారు. నేను ఆరాధనా ప్రార్ధనను ఈలాగున ప్రార్ధిస్తాను: “యేసు ప్రభువా! నేను మిమ్ములను ఆరాధించుచున్నాను. మీ ముందు తలవంచి ప్రార్ధిస్తున్నాను. మీరు దేవుడై, సర్వశక్తిమంతుడై యున్నారు. మీరు నా రక్షకుడై యున్నారు. మిమ్ములను స్తుతించుచున్నాను. మీకు నాపైగల అపారమైన ప్రేమకు వందనములు తెల్పుచున్నాను.” నేను ప్రార్ధించి, ఆయనను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి మరింత ఎక్కువగా Read More …

    7 మెట్టు: బైబిలు గ్రంధం ద్వారా దేవుడు మనతో మాట్లాడుట

    మీ ప్రార్ధన దేవుడు ఆలకిస్తున్నారన్న సంతోషం మీకు కలిగిందా? దేవుడు మీతో మాట్లాడవలెనని, మీ ప్రార్ధనలకు జవాబునివ్వవలెనని మీరు వేచియుంటే,  దేవుడు బైబిలు లోని వాక్యము ద్వారా మీతో  మాట్లాడుతారు. అందుకే బైబిలును  ‘దేవుని వాక్యము’ అని అంటారు. బైబిలు అనగా  క్రైస్తవ లేఖనము, పరిశుద్ధ గ్రంధము. దేవుడే దాని రచయిత. అనేక మంది మనుష్యులను దానిని వ్రాయుటకు వాడుకొన్నారు. వారు దేవుడు చెప్పిన ప్రకారము దానిని వ్రాసారు. బైబిలులో రెండు విభాగములు కలవు: మొదటి విభాగమును Read More …

    8 మెట్టు: దేవుడు మన సృష్టికర్త

    ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ….’ – యోహాను 3:16 లో బైబిలు మనకు చెబుతుంది. బైబిలులో దేవుడు తన గురించియు, తనకు మనపట్ల గల ప్రేమను గురించియు ఏమి చెప్పుచున్నారు? ఆదికాండము 1:1 – బైబిలులోని మొదటివచనము లో  ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’ అని చెప్పబడింది. ఆయన సూర్యున్ని, చంద్రున్ని, నక్షత్రములను, సమస్త ప్రపంచములను సృష్టించెను. ఆయన పర్వతములను, నదులను, సెలయేరులను, జలపాతములను సృష్టించెను. ఆయన చెట్లను, పూవులను, మొక్కలను, సమస్త జంతువులను, పక్షులను Read More …

    9 మెట్టు: ఆదాము, హవ్వ మరియు వారి పాపము

    దేవుడు సృష్టించిన వారిలో మొట్టమొదటి మనుష్యులు ఆదాము మరియు హవ్వ. బైబిలులోని ప్రధమ గ్రంధమైన ఆదికాండములో వీరి గురించి చెప్పబడింది. దేవుడు వారిని తన స్వరూపములో నిర్మించెను. ఎదేను అను సౌందర్యవంతమైన వనమును దేవుడు వారికి జీవించుటకు ఇచ్చెను. దేవుడు ప్రతి రోజు, వారితో కలసి నడచుటకును, మాట్లాడుటకును వచ్చేవారు. అది మీరు ఊహించగలరా? సర్వశక్తిగలదేవుడు, భూమ్యాకాశముల సృష్టికర్త, తాను సృజించిన మనుష్యులతో సమయము గడుపుటకు ఇష్టపడేవారు. ఎందుకంటే వారు ఆయనకు ప్రత్యేకమైన వారు గనుక! అటు Read More …

    10 మెట్టు: మన యెడల దేవునికి ఉన్న ఆశ్చర్యకరమైన ప్రేమ

    ఆదాము, హవ్వ పాపము చేసి దేవునితో వారికిగల సన్నిహితసంబంధం పోగొట్టుకున్నారు. వారు దేవుని యొద్దనుండి దూరముగా వెళ్ళవలసి వచ్చింది. అయితే దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మన పాపములను ద్వేషించినప్పటికీ, మనలను ప్రేమించుట ఎప్పటికి ఆపరు. మన పాపములను తొలగించుకొనుటకు మనము ఏమియు చేయలేమని ఆయనకు తెలుసు. ఆయనతో ఎడబాటు కలిగి ఉండుట అనునది మనకు శాశ్వతముగా లభించిన శిక్ష. మనలను రక్షించి, మనలను ఆయనకు దగ్గరగా తీసికొని వచ్చుటకు ఆయన తన కుమారుడైన ప్రభువైన యేసును Read More …

    11 మెట్టు: క్రిస్మస్ కథ – దేవుడు తన ప్రియ కుమారుని పంపెను

    బైబిలులో  ప్రభువైన యేసు జననవిధానము ఎంతో చక్కగా చెప్పబడింది. ప్రభువైన యేసు జననమునకు అనేక వందల సంవత్సరములకు మునుపే దేవుడు ఒక ప్రవక్త ద్వారా ప్రజలకు ఈ విధముగా ప్రకటింపచేసారు. “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.”- యెషయా 7:14 దేవుడు మన పాపముల నుండి మనలను విడిపించి, దేవుని యొద్దకు తిరిగి తీసికొని వచ్చే ఒక రక్షకుని, లేక విమోచకుని Read More …

    12 మెట్టు: క్రిస్మస్ కథ – దేవుడు మనతో నివసించుటకు వచ్చెను

    మరియ, యోసేపు తమ ఇంటికి దూరంగా ఉన్న బెత్లహేము అను గ్రామములో ఉన్నప్పుడు, మరియకు ప్రసవ సమయము సమీపించెను. వారికి ఉండుటకు అక్కడ ఏ సత్రము (యాత్రికులు ఉండు స్థలము) లోను స్థలము లేకపోయింది. ఆ కారణమున, ఆ బాలుడు ఒక పశువులపాకలో జన్మించి, ఒక పశువుల తొట్టి (పశువులు గడ్డి మేయు తొట్టి) లో అతని తల్లి ద్వారా పెట్టబడినాడు. ఈ పాప లోకమునకు దేవుని కుమారుడు, మీ కొరకు, నా కొరకు వేంచేసారు. మన Read More …

    13 మెట్టు: ప్రభువైన యేసు – ఆశ్చర్యకార్యములు చేయు దేవుడు

    ప్రభువైన యేసు ముప్పైయేండ్ల వయసులో ఉన్నప్పుడు తన ఇంటిని వదిలి తన పరిచర్యను చేయుటకు బయలుదేరెను. లోకములోని అందరిని రక్షించుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను.మనము ప్రభువును, ఆయన శిష్యులను వెంబడించి, ఆయన చెప్పు మాటలను విని, ఆయన చేయు కార్యములను చుద్దామా? నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను! మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు! ఆయన పల్లెల మధ్య తిరుగుచు దేవుని గురించి ఆయన రాజ్యమును గురించి చెప్పుట మనము చూస్తున్నాము. ఆయన అది Read More …

    14 మెట్టు: యజమానుని పాదముల చెంత వేచియుండుట

    మన యజమనుడైన యేసు ప్రభువుతో ప్రయాణము కొనసాగించాలని మీరు ఆసక్తి కలిగియున్నారా? నేను చాలా ఆసక్తి కలిగియున్నాను! పదండి వెళ్దాము! ఆయన చేసిన ఎన్నో అధ్బుతకార్యాలను చూచాము. ఇప్పుడు ఆయన పాదముల చెంత చేరి ఆయన బోధలను విందాము. ఆయన బోధలను వినుటకు అనేకమంది ప్రజలు వస్తునారు. తండ్రిని గూర్చియు, తనను గూర్చియు ఎన్నో శక్తివంతమైన సత్యములను ఆయన వారికి బోధిస్తున్నారు.  సామాన్య మనుష్యులు  ఈ సత్యములను గ్రహింపగలుగుటకు వీలుగా ఆయన పలుమార్లు చిన్న కధలవంటి ఉపమానములను Read More …

    15 మెట్టు: మన పాపముల నిమిత్తము సిలువపై ప్రభువైన యేసు

    “యేసు క్రీస్తు” – లోక రక్షకుడు! 1 తిమోతి 1:15 లో “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను” అని చెప్పబడినట్ట్లుగా తన సంకల్పమును నెరవేర్చే సమయము ఆసన్నమైయింది. శిష్యులతో తను మరణించబోవుచున్నాను అని ఆయన చెప్పినప్పుడు వారు ఎంతో దుఃఖించారు. అయితే తిరిగి మూడవ దినమున లేచెదను అని ఆయన వారితో చెప్పారు. ఆయన ప్రజల పాపములను క్షమించుచున్నారని మతపెద్దలు ఆయన మీద కోపముతో ఆయనను బంధించి, దేవుడ్ని తన తండ్రి అని చెప్పుచున్నారని నేరారోపణ Read More …

    16 మెట్టు: యేసు క్రీస్తు – మనకొరకు లేచిన రక్షకుడు!

    యేసు క్రీస్తు షిష్యులు యేసు ప్రభు దారుణంగా ష్రమకు గురై, సిలువపై మరణించటం చూసారు. షిష్యులు ఆయన లేకుండా ఒంటరిగా భయపడ్తూ ఉన్నారు. మరణించిన మూడవ రోజు, ఆదివారము, కొంతమంది యేసు ప్రభు సమాధి దగ్గరకి వెళ్లారు, అక్కడ ఒక అద్భుతమైన ఆశ్చర్యం చుసారు! పరలోకమునుండి వచ్చిన దేవుని దూత తెరిచివున్న సమాధి దగ్గర నిలుచుండెను. ఫ్రభు దూత షిష్యులతో విజయొత్సాహంతో చెప్పారు: “యేసు ఫ్రభు ఇక్కడ లెరు, తాను చెప్పినట్టె ఆయన లేచి ఉన్నారు!” శిష్యుల Read More …

    17 మెట్టు: దేవుడు, పరిశుధాత్మ

    “యేమిటి ఈ పరిశుధాత్మ?” అని ఆశ్చర్యపడ్తున్నావా? యేసు ప్రభు చనిపొయేముందు, శిష్యులతో తను తన తండ్రి దేవుని యొద్దకు వెలుచున్నానని వారితో చెప్పెను. శిష్యులు ఇది విని చాలా దుఖించారు. వారి మనసులు బాధతో క్రుంగిపొయాయి. అప్పుడు ఆయన: ” దుఖించకుడి…మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై, నా తండ్రి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును…ఈ ఆదరణకర్త మీతో కూడా నివసించును, మీలో ఉండును మీకు అని విషయాలు నేర్పును” అని అనెను. యేసు ప్రభు చనిపొయి, Read More …

    18 మెట్టు: పరిశుధాత్మ – మన సహయకుడు మరియు మార్గనిదర్సి

    ప్రభువైన యేసు సిలువపై వెళ్లేముందు, తమ శిష్యులతో ఇలా అనెను: “సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును” యొహాను సువార్త 16:13 ప్రభువైన యేసు క్రీస్తు స్వర్గానికి వెళ్లినప్పుడు, తమ శిష్యుల యొద్దకు పరిశుధాత్మ పరలోకమునుండి దిగి వచ్చెను. యేసు లో జీవించుటకు, ఆయన గురించి అందరితో చెప్పేందుకు, పరిశుదాత్మ వారిని యెంతో జ్ఞాన, ధైర్య, సాహసాల తో నింపెను. పరిశుధాత్మ మనకి ఎలా సహాయ పడుతుంది? నేను నా జీవితాన్నియేసు ప్రభువుకి సమర్పించినప్పుడు, నా Read More …

    19 మెట్టు: స్వర్గము – మన నిత్య నీవాసము!

    స్వర్గము! పరలోకము గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా నేను సంతోషంగ పాడే పాట ఒకటి గుర్తుకువస్తుంది: “స్వర్గం ఓ అద్భుతమైన ప్రదేశం. కీర్తి మరియు దయతో నిండినది నా రక్షకుని ముఖము చూడాలని ఉంది. స్వర్గం ఓ అందమైన ప్రదేశం!” స్వర్గం దేవుని కీర్తితో నిండిఉన్నది. ఏంతో వైభవం మరియు అందంతో కూడిన ప్రదెశం! స్వర్గం ఒక అద్భుతమైన ప్రదెశం ఎందుకంటె అక్కడ దెవుడు నివసిస్తారు. యేసు ప్రభు దీనిని “నా తండ్రి నివాసము” అనెను. మనందరం, యెహూవ Read More …

    20 మెట్టు: స్వర్గంలో ఉన్న యెహోవా దెగ్గరికి వెల్తాం

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, వారి మతం ఏదైన, స్వర్గానికి వెళ్లాలని అనుకుంటారు. పరలోకం ఒక అద్భుత ప్రదెశం అని వారికీ తెలుసు! వాళ్ళు స్వర్గానికి వెల్టానికి అనేక మార్గాలు ప్రయత్నిస్తారు మొదలైనవి ఇతరులకి సహాయ పడటం, దానాలు చెయటం, స్వయన్సెవ చెయటం…వారి మంచి పనులు చెయటం ద్వార స్వర్గానికి మార్గం సంపాదించాలనుకుంటారు. వారు వారి మంచి పనులతో వారి పాపాలు రద్దు అవుతాయని, అందువలన దేవుడు వారిని స్వర్గంలోకి అనుమతిస్తారని ఆశిస్తారు. మరి కొందరు ఉపవాస ప్రార్థనలు, Read More …

    21 మెట్టు: సాతాను – దేవునికి, మనకి శత్రువు

    ఈ లోకంలో ఉన్న దుష్ఠత్వం గురించి ఏమైన తెలుసా? అది యెక్కడ నుంచి వచ్చిందో మరియు దానివెనుక ఎవరున్నరో? నీవు దేనిగూర్చి సంతోష పడుతున్నావో లేదా సుఖపడుతున్నావో, అది తప్పైనా సరే ముందుకెళ్ళు, పర్వాలేదు అని లో లోపల నీ అంతరాత్మ చెప్పడం ఎప్పుడైనా విన్నావా? దేవునికి, మనకి శత్రువు – పరిశుద్ధగ్రంధం ప్రకారం చూస్తే ఆదుష్టత్వం మరెవరోకాదు సాతాను. అతని (సాతాను) ముఖ్యవుద్దేశ్యమేమిటంటే, అందరు దేవుని ఆజ్ఞలనుండి వైదొలగి, పాపం చేయడమే. బైబిల్లోని ఆదికాండంలో సాతాను Read More …

    22 మెట్టు: ప్రభువైన యేసు మనకి సాతానుపైన విజయం ఇచ్చారు

    అవును! దేవునికి స్తోత్రం! సాతాను బంధకములనుండి విడిపించుటకు మన విమోచకుడు వచ్చాడు. మనము, ఎవరైతే ఆయనచే రక్షింపబడ్డామో, సాతాను బానిసత్వములో ఇకలేము. మనము ఇప్పుడు యెసుప్రభువుకు చెందిన వారము! దేవుని భద్రతలో వున్న ఆయన బిడ్డలము. సాతాను ఓడింపబడిన శత్రువు! బైబిలు చెప్పినట్లుగా, సాతాను ” దయ్యము” లేక “ఈ లోకాధిపతి”.  అతడు ఈ లోకాన్ని, లోకంలో వున్న ప్రజానీకాన్ని ఏలుతున్నాడు. దేవుడు కొద్దికాలం ఈలోకంలో సాతానుకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఒక సమయం త్వరలో రాబోతుంది, అప్పుడు Read More …

    23 మెట్టు: దేవునిని నా సర్వంతో ప్రేమించుట

    ఒక రోజు ఒకడు యేసుప్రభువు దగ్గరకు వచ్చి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేది? అని అడిగాడు. అందుకు ప్రభువు: “నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” – (మార్కు 12:30) ఈ విధంగా ఎలా దేవునిని ప్రేమించాలి ! ఆశ్చర్యమేసింది. అప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయానికి వెలుగును చూపాడు. నేను దేవునిని ప్రేమించాలని కోరుతున్నాడు. నేను ఆయననే ఆరాధించాలని కోరుతున్నాడు. నా జీవితంలో తనకు మొదటిస్ఠానం ఇవ్వాలని Read More …

    24 మెట్టు: ప్రేమించే దేవుడు, ద్వేషించే పాపము

    అసలు “పాపము” అంటే ఏమిటి? ప్రభువులోకి రాకమునుపు నేను ఇలా అనుకుంన్నాను. చిన గుండుసూది దొంగిలించినంత మాత్రాన ఏదో పెద్ద బ్యాంకును దోచినట్టు కాదు కద. నేను అతనిని హాని చేయటానికి ఏమీ చేయలేదు. కానీ నేను ద్వేషించే వ్యక్తికి ఏదైన చెడు జరిగిందంటె నా కెంత సంతోషం!  ఇతర నెరస్థులవలె నేను జైలు కెళ్ళలేదు కాబట్టీ నేను చాల మంచి వాణ్ణి. నేను పాపం చేసిన వాణ్ణి కాదు, నన్ను క్షమించమని దేవుణ్ణీ అడుగక్కర లేదు. Read More …

    25 మెట్టు: ఆలయంలో దేవుని ఆరాధించుట

    ఇది ఆదివారం. ఇతర క్రైస్తవులతోపాటు నేను కూడ దేవుని ఆరాధించడానికి ఆలయానికి వెళ్తున్నాను. నీవుకూడ నాతోపాటు రావడానికి నిర్నయించుకున్నందుకు నాకు చాలా సంతొషంగా వుంది. క్రైస్తవులు ఆదివారమే ఆలయానికి ఎందుకు వెళ్ళ్తారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారంలో మొదటి రోజైన ఆదివరం సమాధిలో నుండి సజీవుడై లేచాడు. కాబట్టి ఈప్రపంచంలోని క్రైస్తవులందరు ఆ దేవుణ్ణి ఆరాద్దించి ప్రార్దించడానికి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి ఆలయానికి లేదా గుడికి వెళ్తారు. ఆదేవుణ్ణి భయభక్తులతో గౌరవించి ప్రార్ధించటానికి వెళ్తారు కాబట్టి Read More …

    26 మెట్టు: సంఘము-భూమిపై మన క్రైస్తవ కుటుంబం

    ఈ రోజు మనం మరొక సంఘానికి హాజరవుదామా? రండి వెళదాం ఒక ఇంటి వద్ద మేము ఆగాము. అది చర్చి భవనం కాదు. లోపలికి వెళ్ళి చూదాం రొండి. లోపలి గదిలో కొన్ని కుటుంబాలు కూడుకొని ఉన్నాయి. వారు మమ్మును ప్రేమ పూర్వకంగా ఆహ్వానించారు ఆరాధనా మొదలైయింది. మా పాటలకు సహకారం అందిచుటకు అక్కడ సంగీత వాయిద్యాలు లేవు. హృదయ లోతుల్లో నుండి పాడే స్తుతి గీతాలు చాలా మధురంగా ఉన్నాయి. ఇతర సంఘాల్లో మాదిరిగానే ఒక Read More …

    27 మెట్టు: ప్రభు యేసు మరల వచ్చుచున్నాడు

    యేసు ప్రభువు సజీవుడై యున్నాడు! ఆయన శిష్యులు అత్యానందముతో ఉన్నారు. యేసు ప్రభువు సజీవునిగా శిష్యులందరికీ నలుబది దినముల వరకు ప్రత్యక్షంగా కనబడి దేవుని రాజ్య సంబంధమైన అనేక సంగతులు వారికీ బోధించెను. అయితే ఆయన వారిని విడిచి వేళ్ళ వలసిన సమయం ఆసన్నమైనపుడు వారు చూచుచుందగానే ఆయన పరలోకమునకు ఆరోహణ మయ్యాడు. వారి కన్నుల ఎదుట ఒక మేఘము ఆయనను పరలోకమునకు కొనిపోయెను. ఆయన ఆరోహణమైపోవుటకు వారు తదేకంగా ఆకాశము చూచుచుండగా, తెల్లని వస్త్రములు ధరించికొనియున్న Read More …

    28 మెట్టు: సత్కార్యముల ద్వారా రక్షణ

    ప్రశాంతముగా కూర్చుని మనం “రక్షణ” అనే ప్రశస్తమైన వరము (బహుమానం) గురించి ఆలోచిద్దాము. ఈ అతి ప్రశస్తమైన వరమును గురించి, నిత్యజీవమును గురించి, వీటిని ఉచితంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. రక్షణ – రక్షింపబడియుండటం దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన వరము. అది మనం చేసిన మంచి పనులకు గాని మన మంచితనానికి గాని అనుగ్రహింపబడిన బహుమతి కాదు. ఆయన అనుగ్రహించిన ఈ ఉచిత రక్షణకు ప్రతిగా దేవునికి మనం ఏమీ చెలించలేము. రక్షణ అనే Read More …

    29 మెట్టు: ప్రభువైన యేసు దేవుని ఏకైక మార్గమా?

    ప్రియమైన స్నేహితుడా, “ప్రభువైన యేసు దేవుని ఏకైక మార్గమా? ప్రపంచంలోని అన్ని మతాల గురించి ఏమిటి? వారందరు దేవుని వైపు నడిపించరా?” అన్ని ఆలోచిస్తున్నారా. సత్యాన్ని కనుగొన్న నా స్నేహితుడైన, రవిని కలసికోమని మిమల్ని కోరుకుంటున్నాను. ఆయన తన కథను మీకు చెబుతాడు. రవి: నేను ఒక మంచి ఉద్యోగం కలిగియున యువకుడిగా ఉన్నాను. కానీ నాకు విశ్రాంతి లేదు. నా జీవితంలో ఏదో లోటు. నాకు దేవుని ఫై లోతైన కోరిక మొదల్ అయింది. నేను Read More …

    30 మెట్టు: ‘సాక్ష్యము’ నేను లోకమంతటికి చెప్పాలి

    దేవుడు ప్రేమ మూర్తియై – ఉన్నాడు. ఆయన ప్రేమ ఆయన కుమారుడైన ప్రభువైన యేసు రూపంలో మన యొద్దకు వచ్చింది. సంతోషకరమైన శుభవార్తను నేనులోకమంతా చెప్పాలి. మన జీవితం దేవునికి అప్పగించుట ద్వారా మరియు ప్రేభువైన యేసుక్రీస్తును వెంబడించుట ద్వారా ఎంత సంతోషం పొందగలమో దీని ద్వారా మనకు ఆర్థమవుతుంది. పాపము వలన తప్పిపోయిన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు నన్ను రక్షించెను. ఆయన లేకుండా నేను రక్షింపబడుట అసాధ్యము. ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు నందు రక్షింపబడి Read More …

    31 మెట్టు: నా స్నేహితుడవైన నీ కొరకే ఈ ప్రార్ధన

    మనము కలసి ఇంతవరకు ప్రభువైన యేసుతో ఆరంభ అడుగులు అని 29 పాఠములను ధ్యానించాము. ప్రభువైన యేసుతో నడిచే ఈ ప్రయాణము మాకు సంతోషం కలిగించునట్లుగానే చెయ్యి పట్టుకొని నిన్ను యేసుతో నడిపించుచుండగా నీకును అధిక సంతోషకరంగా అనిపించు చున్నదని తలంచుచున్నాను. ఆయన నాకు ప్రశస్తమైన ప్రభువును, రక్షకుడును అయినట్లుగానే నీకును ప్రశస్తమైన ప్రభువును, రక్షకుడును కావలెనని నేను ప్రార్ధించుచున్నాను. ఈ క్రింది మధురమైన గీతము మనము ప్రభువులో ఎలా నడువవలెనో తెలియజెయుచున్నది. ఓ ఎంత అద్భుతం, Read More …