29 మెట్టు: ప్రభువైన యేసు దేవుని ఏకైక మార్గమా?

ప్రియమైన స్నేహితుడా, “ప్రభువైన యేసు దేవుని ఏకైక మార్గమా? ప్రపంచంలోని అన్ని మతాల గురించి ఏమిటి? వారందరు దేవుని వైపు నడిపించరా?” అన్ని ఆలోచిస్తున్నారా.

సత్యాన్ని కనుగొన్న నా స్నేహితుడైన, రవిని కలసికోమని మిమల్ని కోరుకుంటున్నాను. ఆయన తన కథను మీకు చెబుతాడు.

రవి: నేను ఒక మంచి ఉద్యోగం కలిగియున యువకుడిగా ఉన్నాను. కానీ నాకు విశ్రాంతి లేదు. నా జీవితంలో ఏదో లోటు. నాకు దేవుని ఫై లోతైన కోరిక మొదల్ అయింది. నేను విశ్వసించే ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, విశ్వమంతా ఆ మహా శక్తి ఆధీనములో ఉంది. కానీ నాకు ఆయనని ఎలా కనుగొనాలో మరియు ఎలా చేరుకోవాలో తెలియదు.

నా కుటుంబానికి చెందిన మతంలో దేవుని వెతకడం ఆరంభించాను. నేను ఇంట్లో మరియు ఆలయంలో అన్ని ఆచారాలు ప్రదర్శించాను, నేను పేదలకు ధర్మం చేసాను, నేను ఉపవాసం మరియు ప్రార్థన చేసాను. కానీ నేను దేవుని దగ్గరికి రాలేక పోయాను. నన్ను దేవుని నుండి వేరుచేసే లోతైన, విస్తారమైన అగాధము ఉన్నటు అనిపించింది. నేను ఇతర మతాల తట్టు చూసాను. ప్రతి మతంలో దేవుని మార్గం ఒక అగాధము వద్ద ఆగిపోయింది! “నేను ఈ పెద్ద అగాధము ఎలా దాటుతానో మరియు దేవుని ఎలా చేరుతానో?” అని నేను నిరాశతో ఆలోచించాను.

ఒక రోజు నేను, నాకు మరియు దేవునికి మధ్య ఉన్న అగాధము నా పాపాలే అని ఒక సందేశంలొ విన్నాను! దేవుడు పవిత్రుడు మరియు స్వచ్ఛమైన వాడు. నేను నిలువునా పాపంతో ఉన్నాను. నా పాపాలు దేవుని యొద్దకు నన్ను చేరనివ్వడం లేదు! “దేవా, నేను ఏమి చేయాలి?” నిరాశతో నేను ఏడిచాను. “మీకు నిరీక్షణ ఉంది,” అని ఆ సందేశం తెలిపింది. “ప్రభువైన యేసు, దేవుని కుమారుడు, అతడు మీ పాపాల కోసం సిలువపై చనిపోయినప్పుడు నీకు మరియు దేవునికి మధ్య ఉన్న అగాధమును తీసివేసాడు.”

నేను యేసుని యొద్దకు పరుగిడి అయన పాదముల యొద్ద మోకరించాను.  “ప్రభువా, నా పాపాలనిమిత్తము నేను చాలా విచారిస్తునాను. దయచేసి నా పాపాలను క్షమించి, నన్ను అంగీకరించండి, “అని నేను ఏడిచాను. శిలువపై నా శిక్షకు వెల చెల్లించినందుకు ప్రభువైన యేసు సంతోషంగా నా పాపాలను క్షమించాడు. ఇప్పుడు నేను పాపపు మరకలనుండి శుబరంగా కడగబడాను.

యేసు ఇప్పుడు నా చేతిని తీసుకున్నాడు మరియు కలిసి మేము అగాధము వైపుకు మళ్ళాము. నా ఆశ్చర్యానికి, నేను అగాధము పై ఒక వంతెనను చూసాను!  అది ఒక శిలువ ఆకారంలో ఉంది. నేను వంతెనపై నా ప్రభువును అనుసరించాను, మరొక వైపు నన్ను ఎదురుచూస్తున్న తండ్రి దేవుడిని చేరుకున్నాను! నా ఆనందానికి హద్దులేదు! నేను దేవుని పాదాల వద్ద పడి, ఆయనను పూజించాను.

నేను పాప అగాధము తటు తిరిగి చూసాను. అనేక మార్గాల నుండి చాలా మంది ప్రజలు దేవుని చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ వారు అందరూ ఆ అగాధము వద్దకు వచ్చి ఆగిపోయారు! అగాధము ఫై వారికి ఎలాంటి మార్గం లేదు. వారు వారి స్వంత ప్రయత్నాల ద్వారా వారి పాపాల పెద్ద అగాధము దాటలేకపోయారు. వారు దేవునికి మొరపెట్టారు, కానీ ఎలాగైతే నేను యేసు దగ్గరకు రాకముందు ఆయనను చేరలేదో అలాగే వారు కూడా దేవుని చేరుకోలేదు. కానీ చాలామంది, యేసు దగేరికి వచ్చి, వారి పాపములు క్షమింపబడి, ఆయనతో సంతోషంగా పెద్ద అగాధము దాటిపోయారు మరియు దేవుడిని చేరుకొని ఆనందిస్తున్నారు!

ఇప్పుడు బైబిల్లో ప్రభువైన యేసు చెప్పిన సత్యాన్ని నేను అర్థం చేసుకున్నాను: “నేనే మార్గము, సత్యము, జీవము. ఎవరూ నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాలేరు. “జాన్ 14: 6

ఇది రవి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం. ఆయన ఇప్పుడు తన పాత పాప జీవితాని వదలి, తన రక్షకుడైన ప్రభువైన యేసు కోసం స్వచ్ఛమైన నూతన జీవితాన్ని జీవించుచున్నాడు. మరియు అతను అందరికి దేవుని మార్గము గూర్చి చెప్పడానికి కోరుకుంటునాడు! నీ గురించి, ఎలా స్నేహితుడ? నీవు ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి నీ పాపములకు క్షమాపణ పొందుకున్నావా మరియు దేవుని మార్గం ఆనందంగా కనుగొన్నావా?

ప్రార్థన: “ప్రభువైన యేసు, నీవు పరిశుద్ధ దేవునికి మార్గమని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. నా పాపాలను క్షమించి, నా కోసం సిలువపై మీ త్యాగం ద్వారా నన్ను దేవుని వద్దకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఆమెన్.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *