ప్రశాంతముగా కూర్చుని మనం “రక్షణ” అనే ప్రశస్తమైన వరము (బహుమానం) గురించి ఆలోచిద్దాము. ఈ అతి ప్రశస్తమైన వరమును గురించి, నిత్యజీవమును గురించి, వీటిని ఉచితంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
రక్షణ – రక్షింపబడియుండటం దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన వరము. అది మనం చేసిన మంచి పనులకు గాని మన మంచితనానికి గాని అనుగ్రహింపబడిన బహుమతి కాదు. ఆయన అనుగ్రహించిన ఈ ఉచిత రక్షణకు ప్రతిగా దేవునికి మనం ఏమీ చెలించలేము.
రక్షణ అనే వరము మనము పొందుటకు అర్హత లేని వారమైయుండగా, దేవుడు తన ప్రేమ చేత ఆ రక్షణ పొందుటకు పాపులమైన మనలను ఎంచుకున్నాడు. దీనినే బైబిల్లో “కృప” అని పిలిచారు. మీరు కృప చేతనే రక్షింపబడియున్నారని – బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. ఈ కృపను మనం విశ్వాసం ద్వారా పొందగలము. కానీ మన మంచి పనుల ద్వారా ఈ కృపను పొందలేము.
“రక్షణ అనే వరం నాకుంది. దేవుడు నా పాపములను క్షమించాడు” అనే విషయం నీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన నన్ను పరలోకం తీసుకెళతాడు. కాబట్టి నేను మంచి పనులేమీ చేయనకర లేదు. నాకు నచ్చిన పని నేను చేయవచ్చు అని మనం అనుకోవచ్చా? ఈ అంశాన్ని గురించి కొంత ఆలోచిద్దాము.
ప్రభువైన యేసును మనలను క్షమించమని అడిగితే ఆయన మనలను శుద్దీకరించి మనలను నూతన సృష్టిగా చేస్తాడు. దేవుని కుటుంబంలోని మనం తిరిగి జన్మిస్తాము. క్రొత్తగా జన్మించిన శిశువు వలె మనం క్రొత్త జీవితం ఆరంభిస్తాం. ఒక శిశువు తలిపై ఆధారపడుతూ – జీవించినట్లే, ఈ నూతన జీవితం జీవించడానికి మనం కూడా అనుక్షణం దేవునిపై ఆధారపడతాము. ఆది ఒక శూన్య జీవితం కాదు. దేవుని కొరకు మనం మంచి కార్యాలు చేస్తూ, దేవుని కొరకు పరిపూర్ణమైన జీవితం జీవిస్తాము.
పాత పాప సుంభంధమైన కోరికలన్నీ నశించిపోతాయి. వాస్తవంగా చెప్పాలంటే క్రొత్తగా ప్రభువులో జన్మించాక పాత పాప సంబంధమైన ఆశలను మనం అసహ్యించుకుంటాము. సాతాను మనలను శోధించి మరలా పాత పాప జీవితానికి మనలను ఆకర్షించినప్పటికీ మనం “కాదు” లేదా “వద్దు” అని చెప్పగలిగేలా దేవుడు మనలను బలపరుస్తాడు.
“మనము క్రీస్తు యేసు నందు సృష్టిపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. ఎఫెసీ 2:10” అని బైబిలు చెప్పుచున్నది.
కాబట్టి మనం రక్షణానందంతో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురుచూస్తాము. లేదా పరలోకమంలో ఆయనతో ఉండటానికి వెళ్ళుటకు ఆశతో ఎదురు చూస్తాము. ఆయన చేయమని కోరిన సమస్త మంచి కార్యములను, ఆనందముతో చేయడానికి ఆయన పిలుపు అంగీకరిద్దామ్.
ప్రార్ధన: పరలోకమందున్న మా తండ్రీ, సర్వ పూరితమైన, వ్యర్ధమైన జీవితం జీవించకుండా సహాయము చేయుము. నీ కొరకైన సకల మంచి పనులు చేస్తూ జీవించే జీవితం దయ చేయుము. ఆమెన్!