అసలు “పాపము” అంటే ఏమిటి?
ప్రభువులోకి రాకమునుపు నేను ఇలా అనుకుంన్నాను. చిన గుండుసూది దొంగిలించినంత మాత్రాన ఏదో పెద్ద బ్యాంకును దోచినట్టు కాదు కద. నేను అతనిని హాని చేయటానికి ఏమీ చేయలేదు. కానీ నేను ద్వేషించే వ్యక్తికి ఏదైన చెడు జరిగిందంటె నా కెంత సంతోషం! ఇతర నెరస్థులవలె నేను జైలు కెళ్ళలేదు కాబట్టీ నేను చాల మంచి వాణ్ణి. నేను పాపం చేసిన వాణ్ణి కాదు, నన్ను క్షమించమని దేవుణ్ణీ అడుగక్కర లేదు.
ఎంత పొరపాటు. దేవుడు మనకు కావలసిన ముఖ్య శాసనాలు లేద ఆజ్ఞలు బైబిలు లోని
నర్గమ కాండము 20: 3-17 వచనం వరకు మనకు తెలియజేసి ఇచ్చాడు. వాటినే “దేవుని పది ఆజ్ఞలు” అని అంటాము. వాటిలో నెను ఏ ఒక్క ఆజ్ఞేయినా మీరితే నెను పాపం చేసినట్టె.
మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఆజ్ఞలన్నిటిని మనకొరకు అర్ధమయేలా ఇలా వివరించాడు “నీవు నీ హ్రుదయ పూర్వకముగ ఆ దేవుని ప్రేమించు. నిన్ను నీవు ఎలా ప్రేమించు కుంటావో ఇతరులనుకూడ అలాగే ప్రేమించు”.
చాలాసార్లు దేవునికి ఇతరులకి వ్యతిరేకంగ చేసిన పాపాలే నాలో ఎక్కువగా వున్నాయి. సమస్తము ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి నా అంతరంగేమ్ మేమిటో కూడ ఆయనకు తెలుసు. నేనేం చేస్తున్నానో అదేకాకుండ దానికి గల కారణాలు కూడ ఆయనకు తెలుసు నేను బయటికి ఒకలాగ లోపల మరోలగ వుండేట్టు నటించలేను. ఎందుకంటే ఆయననుండి ఏదియు దాచలేను. ఆయనకు మరుగైవున్నదేదియు లేదు.
దేవుని ద్రుష్టిలో నేనే ఎంత పాపాత్ముడినో గుర్తించాను. ఆయనను ప్రేమిస్తాను కాని ద్వేషించను. నేను ఆయననుండి పాపక్షమాపణ కోరుతాను.
ఇప్పుడునేను ఆయనకు మహిమకరంగా వుండేట్టు జీవించాలనుకుంటున్నాను. నన్నురక్షించి నాకొరకు ప్రాణమర్పించిన ఆరక్షకునికి మహిమ తెచ్చేవిధంగా జీవించడానికి మరెన్నడు నేను చేసిన పాపాలు ఇక చేయను.
బైబిలు మనకు ఇలా చెప్తుంది: “కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన స్రుష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను”. 2 కొరింథీ. 5:17
ఫ్రార్దన: ఫ్రభువైన దేవా నేను తిరిగి పాత జీవితంలోకి వెళ్ళి పాపాలు చేయకుండ వుండడానికి తగిన సహయం చేయమని నిన్ను నా హ్రుదయ పూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమెన్!