ఒక రోజు ఒకడు యేసుప్రభువు దగ్గరకు వచ్చి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేది? అని అడిగాడు.
అందుకు ప్రభువు: “నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” – (మార్కు 12:30)
ఈ విధంగా ఎలా దేవునిని ప్రేమించాలి ! ఆశ్చర్యమేసింది. అప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయానికి వెలుగును చూపాడు.
నేను దేవునిని ప్రేమించాలని కోరుతున్నాడు. నేను ఆయననే ఆరాధించాలని కోరుతున్నాడు. నా జీవితంలో తనకు మొదటిస్ఠానం ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన నాపట్ల ఏంచెసాడో ఒకసారి వెనుదిరిగి చూసుకున్నాను. నా తల్లి గర్భంలో నన్ను సృజించి, జీవితం ప్రసాదించాడు. అన్ని దీవెనలు ఈ జీవితంలో అనుభవింప చేసాడు.
నా పాపపు జీవితం నుంచి రక్షించటానికి తన ఏకైక కుమారుని పంపి, నూతన జీవితం ప్రసాదించాడు. ఆయన పరిశుద్ధాత్మను నాకనుగ్రహించి, నా జీవితాంతంవరకు నన్ను ఆదరించి కాపాడుటకు సహాయం చేశాడు. ఆయన నాతో ఉంటానని, అన్ని శోధనలనుండి తప్పిస్తూ నా జీవితానికి తగు దారిచూపిస్తూ ఉంటానని నాకు వాగ్దానం చేసాడు.
ఆపరలోకంలో ఎల్లప్పుడు ఆయనతో ఉండు లాగున నాకు స్థిరనివాసం ఏర్పరచాడు.
ఇన్ని ఆశీర్వాదములతో దీవిస్తూ వున్న దేవునిని ఎలా ప్రేమించకుండా ఉండగలను? అప్పుడు అనుకున్నాను: ఏవిధంగా నా ప్రేమను దేవునికి కనబరచుకోవాలి? తిరిగి పరిశుద్ధాత్మ నా హృదయానికి తన వెలుగును ప్రసాదించి త్రోవను చూపించాడు.
మొదటిగా ఆయనపట్ల నాకున్న ప్రేమ ఎలా కనబరచుకోవాలంటే ఆయన ద్వేషించే పాపాన్ని నేను కూడ ద్వేషించాలి.
వచ్చే పాఠంలో, దేవుని దృష్టిలో పాపమంటే ఏమిటో తెలుసుకుందాం.
ప్రార్ధన: పరలోకమందున్న నా తండ్రీ, దయ చేసి నా పూర్ణ హృదయంతో నిన్ను ఎలా ప్రేమించాలో నాకు తెలిపి సహాయం చేయుము. ఆమెన్!