అవును! దేవునికి స్తోత్రం! సాతాను బంధకములనుండి విడిపించుటకు మన విమోచకుడు వచ్చాడు. మనము, ఎవరైతే ఆయనచే రక్షింపబడ్డామో, సాతాను బానిసత్వములో ఇకలేము. మనము ఇప్పుడు యెసుప్రభువుకు చెందిన వారము! దేవుని భద్రతలో వున్న ఆయన బిడ్డలము.
సాతాను ఓడింపబడిన శత్రువు!
బైబిలు చెప్పినట్లుగా, సాతాను ” దయ్యము” లేక “ఈ లోకాధిపతి”. అతడు ఈ లోకాన్ని, లోకంలో వున్న ప్రజానీకాన్ని ఏలుతున్నాడు.
దేవుడు కొద్దికాలం ఈలోకంలో సాతానుకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఒక సమయం త్వరలో రాబోతుంది, అప్పుడు దేవుడు తను ఏర్పాటు చేసిన పాతాళంలో, సాతానును, వాని సమూహాన్ని త్రొసివేస్తాడు. ఏవిధంగా ఆదాము హవ్వలకు దేవుడు అవకాశం ఇచ్చాడో, అదేవిధంగా మనకందరికి అవకాశం ఇస్తాడు. నేను దేవునికి లోబడి అనుసరించాలా లేక సాతానుకు లోబడి అనుసరించాలా? ప్రభువైన యేసును ఎప్పుడైతే నాసొంత రక్షకుడిగా ఒప్పుకున్నానో అప్పుడే దేవుని సన్నిధికి చేర్చబడ్డాను.
సాతాను నన్ను పోగొట్టుకున్నాడు! ఇప్పుడు వాడు నాకు శత్రువు. దేవుడు నన్ను ప్రేమించుటలేదు కనుక దేవునిని వెంబడించవద్దు అనే వుద్దేశాన్ని కలిగించుటే సాతాను ప్రధమ లక్ష్యం. సాతాను చాల శక్తిమంతుడు. ఈ లోకపు జిలుగులు, డంబములు, ఆశలు చూపి ఏవిధంగానైనా నన్ను తిరిగి తనతో చేర్చుకోవాలని రకరకాలుగా ప్రయత్నించి బాధిస్తాడు, శోధిస్తాడు.
కాని బైబిలు ఏంచెప్తుందంటె:
“మీలో వున్నవాడు లోకంలో వున్నవానికంటే గొప్పవాడు” – (1 యోహాను 4:4)
“అపవాదిని యెదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” – (యాకోబు 4:7)
కనుక సాతానుకు భయపడవద్దు. ప్రభువైన యేసుదగ్గరకు వచ్చి హాయిగా, సురక్షితంగా వుండు. నేనైతే నాజీవితాంతం ప్రభు యేసుని వెంబడిస్తా. ఎందుకంటే సాతాను శక్తులను జయించి ప్రభు యేసుతోనే నడిచి, ప్రతిరోజు ఆయనతోనే జీవించడానికి ఆ పరిశుధాత్మ మనకు శక్తినిస్తాడు.
ప్రార్ధన: యేసు ప్రభు, సాతాను మోసాలకు ఆకర్షణలకు లోబడకుండా వాటిని ఎదిరించే శక్తిని, బలాన్ని ప్రసాదించు. యెల్లప్పుడు నీతోనే జీవించడానికి సహాయం దయచేయుము. ఆమెన్!