మీ ప్రార్ధన దేవుడు ఆలకిస్తున్నారన్న సంతోషం మీకు కలిగిందా?
దేవుడు మీతో మాట్లాడవలెనని, మీ ప్రార్ధనలకు జవాబునివ్వవలెనని మీరు వేచియుంటే, దేవుడు బైబిలు లోని వాక్యము ద్వారా మీతో మాట్లాడుతారు. అందుకే బైబిలును ‘దేవుని వాక్యము’ అని అంటారు. బైబిలు అనగా క్రైస్తవ లేఖనము, పరిశుద్ధ గ్రంధము. దేవుడే దాని రచయిత. అనేక మంది మనుష్యులను దానిని వ్రాయుటకు వాడుకొన్నారు. వారు దేవుడు చెప్పిన ప్రకారము దానిని వ్రాసారు. బైబిలులో రెండు విభాగములు కలవు: మొదటి విభాగమును పాత నిబంధన అనియు , రెండవ విభాగమును క్రొత్త నిబంధన అనియు అంటారు.
పాత నిబంధనలో దేవుడు భూమ్యాకాశముల యందు సమస్తమును ఎలాగు నిర్మించారో మనము చదువుతాము. పాత నిబంధన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలియుల మధ్య యేసు ప్రభువు జన్మించుటకు ఏ విదముగా సిద్ధపాటు చేసారో మనకు విశదీకరిస్తుంది.
క్రొత్త నిబంధనలోని మొదటి నాలుగు పుస్తకములు – మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులను – సువార్తలు అని అంటారు. సువార్త అంటే యేసు ప్రభువును గూర్చిన మంచి వార్త. యేసు ప్రభువు జీవితమును గూర్చి, బోధనలను గూర్చి ఇవి వివరిస్తాయి. క్రొత్త నిబంధనలోని మిగిలిన పుస్తకములలో యేసు ప్రభువును వెంబడించే వారి గూర్చి, వారు ఏలాగున వారి జీవితములలో నడచుకోవాలో వివరింపబడింది. ఆయన మన రక్షకుడు అని విశ్వసిస్తాము గనుక ప్రభువైన క్రీస్తును వెంబడించేవారిని క్రైస్తవులు అనియు, విశ్వాసులు అనియు అంటారని మనము నేర్చుకుంటాము.
బైబిలును మీ చేతిలోకి తీసికొని, కనులు మూసుకొని, ఆయన మాటలు మీకు అర్ధమవ్వాలని ప్రభువైన యేసును ప్రార్ధించి అడగండి. క్రొత్త నిబంధనలోని సువార్తలను చదువుట మొదలుపెట్టండి.
దేవుని వాక్యము చదివి, ప్రార్దించుటకు ఒక సమయం కేటాయించండి. దేవుని వాక్యమును చదువుచున్నపుడు, ఆయన వెలుగు మీ హృదయములో తేజరిల్లుతుంది. మీరు చదువుచున్న వాక్యము స్పష్టముగా మారుట మీరు కనుగొంటారు.
మీ జీవితంలో మీరు నడవవలసిన మార్గములో మిమ్ములను నదిపించవలెనని ప్రభువైన యేసు కోరుచున్నారు – అది బైబిలులో ఉంది.
మీ ప్రార్ధనలకు జవాబుగా మీకు వాగ్ధనములను ఇచ్చుటకు ఆయన కోరుచున్నారు. ఇది కూడా బైబిలులో ఉంది. మీరు బైబిలును ఎక్కువగా చదువుట మొదలుబెట్టినపుడు, ప్రభువైన యేసు మీకివ్వవలెనని వేచియున్న నిధులను మీరు కనుగొంటారు. అవి శాంతి, సంతోషము, నడిపింపు, భధ్రత.
ప్రార్ధన: ప్రభువైన యేసు! మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాకు బోధించండి, నేను ఆలకించుచున్నాను ప్రభువా! ఆమెన్!